మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా... శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, శుక్రవారం జరుగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
• Vanguri Ganeswara rao