బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ గతంలో ఒకసారి తన సోదరి, బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్‌ను బెదిరించాడని తాజాగా రంగోలి ట్విటర్ ద్వారా సంచలన ఆరోపణ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఓ నియంత అంటూ జావేద్ అక్తర్, మహేశ్ భట్ ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.ప్రధానిని వీరిద్దరూ నియంత అనడం గురించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రంగోలీ స్పందించింది. `గతంలో ఒకసారి కంగనను జావేద్ అక్తర్ తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత `నువ్వు హృతిక్‌కు సారీ చెప్పకపోతే ఊరుకునేది లేదు` అంటూ బెదిరించాడు. ఇక, ఓ సినిమా విషయంలో కంగనపై మహేశ్ భట్ చెప్పులు విసిరాడు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ప్రధానిని నియంత అంటున్నారు` అంటూ రంగోలి ట్వీట్ చేసింది.
హృతిక్‌కు సారీ చెప్పమని బెదిరించాడు: