మే 31వరకు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు



తిరుమల: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతో తితిదే కీలక నిర్ణయ తీసుకుంది. మే 3వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, మే 31 వరకు ఆర్జిత సేవలూ రద్దు చేసింది. ఇప్పటికే బుక్‌చేసుకున్న వారు తమ టికెట్ల వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ పంపాలని సూచించింది. దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవల వివరాలను helpdesk@tirumala.orgకి పంపాలని తితిదే అధికారులు కోరారు.