చోడవరం : పొడుగించిన లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని ట్రెయినీ డిఎస్‌పి రవికిరణ్ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు విదేశాల నుంచి 69 మంది వచ్చారని, వీరందరినీ 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. బొడ్డేరు వంతెన, వెంకన్నపాలెం వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎమర్జెన్సీ పాసుల కోసం 95052 00100 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
లాక్‌డౌన్‌కు సహకరించాలి : డిఎస్‌పి
• Vanguri Ganeswara rao