తూతూమంత్రంగానే వివాహ వేడుక

అనకాపల్లి: పెళ్లంటే జీవితాంతం గుర్తుండిపోయే ఒక తియ్యని జ్ఞాపకం. ఉన్నంతలో దాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. బంధుమిత్రులు, బాజాభజంత్రీలు, బంతిభోజనాలతో వివాహ వేడుక కనులపండువగా జరుగుతుంది. అయితే కరోనా పుణ్యమా అని పెళ్లి తంతు తూతూమంత్రంగానే పూర్తిచేయాల్సి వస్తోంది. భౌతిక దూరంతోపాటు, సమూహాలు ఉండరాదనే నిబంధనల కారణంగా పెళ్లి సరదాలను పక్కన పెట్టి కుదిరిన మంచి ముహూర్తానికి వివాహం జరిపించేస్తున్నారు.