ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక అడుగు.. దేశంలోనే తొలిసారి..


ఈ రోజు రాష్ట్రంలో కరోనా పై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, బాధితులకు అందుతున్న చికిత్స సహా ఇతర అంశాలపై సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి బాధితుడికి రోజూ భోజనం, వసతి లాంటి అవసరాల కోసం రూ. 500కు తక్కువ కాకుండా కేటాయించాలని అధికారులకు సూచించారు. అలాగే వారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని తెలిపారు. ఇక క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కారోనా బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయల గురించి అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు . ప్రస్తుతం రోజుకు 2100 కు పైగా పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల్లో కరోనా వైరస్‌ పరీక్షల రోజువారీ సామర్థ్యం 2వేల నుంచి 4వేలకు పెంచుతామని అధికారులు తెలిపారు. ఇక అలాగే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి , పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను చెప్పిన అధికారులు ఇక ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50 పారిశుద్ధ్యం కోసం, ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు రూ.300, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300 ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు