ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు


నర్సీపట్నం : రెండో విడత ఉచిత రేషన్‌ బియ్యం, పప్పును వాలంటీర్లు ద్వారా ఇంటింటికీ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు 5,10,15,20 కిలోల బియ్యాన్ని సంచుల్లో నింపి, పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. డీలర్ల నుంచి వాలంటీర్లు బియ్యాన్ని తీసుకుని, కూపన్లు వారీగా కేటాయించిన సమయంలో 16 నుంచి కార్డుదారులకు అందజేయనున్నట్లు ఎఎస్‌ఒ రుద్రరాజు సత్యనారాయణ తెలిపారు.