గుంటూరుఈ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఉదయం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజరు మాట్లాడుతూ... కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచనలు చేయాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను ఎలా తొలగించాలనే పనిపైనే దృష్టి పెట్టిందన్నారు. నిమ్మగడ్డ రమేష్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ, రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కి లేఖ రాశారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం సిగ్గు విడిచి నీచమైన రాజకీయాలకు తెర తీస్తుందని ముప్పాళ్ళ మండిపడ్డారు. ఈ ఆర్డినెన్స్ న్యాయ వ్యవస్థ ముందు నిలవదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా అక్రమంగా, దౌర్జన్యంగా జరిగాయని ఆరోపించారు. ఎన్నికలు మొత్తం ఏకగ్రీవం అవ్వాలనే దురుద్దేశంతో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే అభ్యర్థులపై దాడులు చేసి వారి వద్ద ఉన్న పత్రాలను లాక్కొని చింపి వేశారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నియంత పరిస్థితులపై న్యాయ స్థానం అడ్డుకట్ట వేయాలని ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. .ృ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను వైసిపి తొలిగంచడం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం : సిపిఐ