ములగపూడిలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడుగుతున్న వెంకటరమణ





నక్కపల్లి, : నక్కపల్లి పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను  ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సత్కరించారు. అనంతరం వీరికి నిత్యావసర సరకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరిని లాక్‌డౌన్‌ హీరోలుగా అభివర్ణించారు. పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి వీసం రామకృష్ణ, తహసీల్దారు వీవీ రమణ, ఎంపీడీఓ రమేశ్‌రామన్‌, ఈఓఆర్డీ చంద్రశేఖరరావు తదితరులున్నారు. దేవవరంలో పంచాయతీ కార్యదర్శి సాయిలక్ష్మి, మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. సమాజానికి పారిశుద్ధ్య కార్మికులు విలువైన సేవలందిస్తున్నారని భాజపా మండల పార్టీ అధ్యక్షుడు లాలం వెంకటరమణ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ములగపూడిలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తకు కాళ్లు కడిగి దుస్తులు అందించి సత్కరించారు. అనంతరం అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు కృష్ణ, భాజపా ఓబీసీ విభాగం జిల్లా కార్యదర్శి ఎల్‌.విక్రమ్‌ పాల్గొన్నారు.