భీమవరం : లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రజల రాకపోకలను నివారించేందుకు పోలీసులు మండల, పట్టణ, గ్రామాల సరిహద్దుల వద్ద నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. వారికి తోడుగా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను నియమించింది. ఆర్టీసీ బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో మొదట విధులకు దూరంగా ఇళ్లకే పరిమితమైన ఆ సంస్థ ఉద్యోగులు కొద్ది రోజులుగా ప్రత్యేక విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో కలిపి మొత్తం 429 మంది ఉద్యోగులు కరోనా విధుల్లో పాల్గొంటున్నారని ఆర్టీసీ పశ్చిమ రీజియన్ మేనేజర్ వీరయ్యచౌదరి తెలిపారు.
లాక్‌డౌన్ విధుల్లో ఆర్టీసీ ఉద్యోగులు