హైదరాబాద్: మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ కరోనాను ఎదుర్కొనేందుకు మానవత్వాన్ని చూపుతూ ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై పోరులో తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారు. వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నారు. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేశంపట్ల, సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు
సమాజం కోసం తనవంతు బాధ్యత అంటూ ముందుకు వచ్చిన చిరంజీవి తల్లి