మనం చారిటబుల్ ట్రస్ట్ వారి ఉదారత  

 



ఎలమంచిలి.: మానవసేవే మాధవసేవ అని నమ్మేమనం చారిటబుల్ ట్రస్ట్ వారి  ఆధ్వర్యంలో  కొక్కిరాపల్లి అగ్రహారం దుర్గమ్మ వీధికి చెందిన గొర్లే శ్రీనివాస్, కడిమి శెట్టి రమేష్ వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి నూట అరవై మందికి భోజనం తయారుచేసి మనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకి ఇవ్వడం జరిగింది. వీళ్లు స్థానిక ప్రేమ సమాజం లోని పిల్లలకు, వృద్ధులకు అలాగే హైవే రోడ్డు మీద యాచకులకు,  స్టేషన్ రోడ్డు దగ్గర స్కూల్లో ఉన్న యాచకులకు మరియు ఎర్రవరం బీపీసీఎల్ బంకు దగ్గర లారీ డ్రైవర్ లకు,  క్లీనర్ లకు ఎలమంచిలి టౌన్ ఎస్ఐ నాగ కార్తీక్ గారిచే ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ జంగాల కళ్యాణ్, కోశాధికారి  పండూరి సురేష్,  పిట్టా  ప్రకాష్,  జయంత్,  K. ఈశ్వరరావు,  శ్యామలరావు,  D. శ్రీను,  గోర్లే శ్రీను, శ్రీరామ్,  వీసం రాఘవరావు, గొర్లె గోవింద్, దొడ్డి వెంకటేష్ మణికుమార్, J. నాగేశ్వరరావు రత్న రాజు మాస్టారు ,కర్రి  వీరు నాయుడు మాస్టారు, తంగేటి సూర్య ప్రకాష్, S.సతీష్  తదితరులు పాల్గొన్నారు