ఇప్పుడు ఏంఆలోచిచాలి...
ఈవిపత్తు రెండు ప్రధానాంశాలను తెరమీదకు తెచ్ఛింది. ఒకటి ప్రజారోగ్యం. రెండవది ఉన్న చోట ఉపాది. ప్రజారోగ్యం, మౌలిక వసతుల డొల్లతనం అర్థమైంది. జ్వరాల వంటి చిన్న వ్యాదులు సామూహికంగా ప్రబలితే ప్రజలకు వైద్యం అందడంలేదు. స్థానికంగా ఉండే వైద్యులే ఆదుకుంటున్నారు. అందుకని ముందు గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేయాలి. మూడంచెల వైద్యవ్యవస్థను పటిష్ట పరచాలి. అన్నిమౌలిక వసతులూ కల్పించాలి. జవాబుదారీతనం తీసుకురావాలి. వ్యాధుల పరిశోధన కూడా పెరగాలి. ఒక్కో రాష్ట్రంలో మూడు నాలుగు పరిశోధనాలయాలు ఏర్పాటు చేయాలి. ప్రాణాలను విలువతో కాకుండా విలువలతో చూడాలి. మనిషి అరుదైనవాడు.
వలసల లేని ప్రపంచాన్ని సృంచాలి. దీనిద్వారా నగరాల్లోని వత్తిడి ని మనం అధిగమించవచ్ఛు. ఇప్పటి విద్య ప్రజలను ఊళ్ళనుంచి తరిమేస్తోంది. దీన్ని మార్చాలి. పనితోకూడిన కొత్తవిద్యను మనంతీసుకురావాలి. దీనికి ఒక సమగ్ర విధానం రూపొందించాలి. గ్రామీణ సాంకేతికతనూ , వృత్తులనూ బలపరచాలి.గ్రామాలు ఉత్పత్తి కేంద్రాలు గా మారాలి. గ్రామాల్లో విద్య, వైద్యం, ఉపాధి, పర్యావరణ విషయాల్లో సమగ్ర విధానం రూపొందించాలి.