తాళాలు పడ్డ జీవితాలు
దేశానికి జీవనానికీ తాళాలు పడ్డ ఈ 22రోజుల్లో ఎక్కువగా ప్రభావితం అయిన వర్గం వట్టణాలకు వలసవెళ్ళిన కూలీలు.దూరతీరాల నుంచి నడచివస్తూ ప్రమాదాలలో,ఆకలితో ప్రాణాలు వదలడం పెద్ద విషాదం. అంతరక్షాన్ని జల్లెడపడుతున్న ఈకాలంలో మూలమైన మనిషి ప్రాణం విలువ ఎంతస్వల్సమైనదో. వీరితరువాత గ్రామాల్లో కూలీలూ, పరిశ్రమల్లో కార్మికులూ' చిన్న రైతులూ , చిన్నవ్యాపారులూ ఇబ్బందులు పాలయ్యారు.
అన్నిరంగాలూ ఈ కాలంలో ప్రభావితమయ్యాయి. భిక్షవారూ దిమ్మరులూ ఆకలిచావులకు గురయ్యారు. వ్యవసాయం అనుబంద రంగాల్లో పరిశ్రమల్లో ఉత్ఫత్తి నిలిచి పోవడం వల్ల పెద్దమొత్తంలో ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. ఈనిరుద్యోగితా అన్నిరంగాల్లో ఉత్పత్తినిలిచిపోవడం వంటి పరిణామాలతో అశాంతికి దారి తీస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు లేకపోవడంతో కరవు కోరలు చాస్తుంది. ప్రధానంగా గ్రామాల్లో ఉద్యోగిత పెంచడం వంటి చర్యల ద్వారా వలసలు నివారించాలి. ఈపరిస్తితులకు తగిన హ్యూహాలు మనం రూపొందించుకోవాలి..