శానిటైజర్ మిషన్‌ను తయారు చేసిన వ్యక్తి.. ప్రారంభించిన సిఐ..
పశ్చిమ గోదావరి : కరోనా నివారణ చర్యల్లో... తన వంతు సాయంగా ఓ ముస్లిం వ్యక్తి సామాన్యులకు అందుబాటులో శానిటైజర్ మిషన్‌ను తయారు చేశాడు. రహిమ్ అనే వ్యక్తి చింతలపూడి మండలంలోని పాత బస్టాండ్ వద్ద సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా శానిటైజర్ మిషన్ ను తయారుచేశాడు. సోమవారం ఉదయం ఆ మిషన్ ను చింతలపూడి సిఐ పి.రాజేష్ ప్రారంభించారు. సామన్యులు ఎవరైనా అక్కడకు వచ్చి చేతులు శుభ్రంగా కడుక్కోవచ్చని, దీనికయ్యే ఖర్చు తానే భారిస్తానని రహిమ్ తెలిపాడు. రహీమ్ సేవా దృక్పథాన్ని స్థానిక ప్రజలు, సిఐ అభినందించారు.