<no title>

ఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్, ఏప్రిల్‌లో అదనపు శాలరీ 


దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఇండియా, పిలిప్పైన్స్ దేశాల్లోని తమ ఉద్యోగులకు ఏప్రిల్ నెలలో 25 శాతం అదనపు వేతనం ఇస్తామని తెలిపింది. అసోసియేటెడ్ లెవల్ నుండి కిందిస్థాయి ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఐటీ సహా దాదాపు అన్ని రంగాల ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి బేసిక్ శాలరీపై 25 శాతం అదనంగా ఇస్తామని తెలిపింది.