గుంటూరు: కరోనాపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ దుయ్యబట్టారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాగేనా వ్యవహరించేంది? అని ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఏపీలో ఉండి పనిచేయాలని, హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబులా తాము చేయలేమని, తాము వాస్తవానికి దగ్గరగా ఉంటామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదలకు నిత్యావసరాలు ఇచ్చామని, ఆక్వా, పౌల్ట్రీ రంగాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మోపిదేవి వెంకటరమణ భరోసా ఇచ్చారు.
చంద్రబాబు కరోనాపై రాజకీయం చేస్తున్నారు: మోపిదేవి