అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఏ సమయంలో నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కొత్త కమిష నర్ జస్టిస్ వి.కనగరాజ్ కోరారు. అధికారులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం కావాలన్నారు. అపుడే సమర్థంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 11న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కనగరాజ్ విజయవాడలోని ఆర్‌అండ్‌బీ సముదాయంలో కమిషన్ కార్యాలయంలో ఎస్‌ఈసీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ కనగరాజ్ మాట్లా డుతూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివ ద్ధి కార్యక్ర మాలు చేరాలనే ఉద్దేశంతోనే స్థానిక సంస్థలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మునిసి పల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు ఏక్షణంలో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. సమయానికి అనుగుణంగా కార్యచరణ ప్రణాళికలు ఉండా లని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందన్నారు. చక్కటి అవగాహనతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పేరును తీసుకుని రావడంలో అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యధార్ధ స్థితిని అధికారులు కమిషనర్‌కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎ.వి.సత్య రమేష్, జాయింట్ డైరెక్టర్లు సాయి ప్రసాద్, ఏఎస్ సాంబమూర్తి, పీఎస్ రామారావు పాల్గొన్నారు.
ఏక్షణంలోనైనా ఎన్నికలు రావచ్చు