అంబేద్కర్‌ బోధనలను ఆచరిద్దాం


న్యూఢిల్లీ :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ బోధనలను ఆచరిం చాలని, బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని స ష్టించడానికి తోడ్పడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 14న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి పురస్కరించుకొని రాష్ట్రపతి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌-19 మహ మ్మారిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ
‘భౌతిక దూరం’ పాటించాలని, అలాగే ఇళ్లలోనే ఉండి అంబేద్కర్‌ జయంతిని జరుపుకోవాలని కోరారు. సామాజిక సంస్కర్త, విద్యావేత్త, ఆర్థిక వేత్త, రాజకీయ వేత్త, న్యాయ నిపుణుడిగా అంబేద్కర్‌ దేశం, సమాజ ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేశారని రాష్ట్రపతి అన్నారు. సామాజిక సామరస్యం, సమానత్వం ప్రబలంగా ఉండవలసిన సమాజాన్ని అంబేద్కర్‌ ఊహించా రని రామ్‌నాథ్‌ కోవింద్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ‘ఇందుకోసం ఆయన తన జీవితమంతా సమాజం, దేశం కోసం అంకితం చేశారు. అంబేద్కర్‌ భారతదేశానికి ప్రగతిశీల, సమగ్ర రాజ్యాంగాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా దేశ ప్రజాస్వామ్యంలో తోటి పౌరుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా డాక్టర్‌ అంబేద్కర్‌ గొప్ప ఉన్నతిని, పోరాటం, విలువలను ప్రేరణగా తీసుకుందాం. ఆయన బోధనలు, ఆదర్శాలను మన జీవితా ల్లోకి చొప్పించి బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని స ష్టించడానికి దోహదం చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్రపతి తన సందేశంలో పిలుపునిచ్చారు.