హైదరాబాద్: కరోనా వైరస్ చిన్నారుల్ని సైతం వద లడం లేదు. నెలల పసికందు నుంచి ముసలివాళ్ల వరకు ఈ వైరస్ అందరికీ వ్యాపిస్తోంది. తాజాగా తెలంగాణలో ఏడేళ్ల బాలుడు కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన వ్యక్తి (36) గత నెల 17న స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్థకు చెందిన అతిథి గ హంలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలడంతో ఇంటికెళ్లాడు. అయితే, ఈ నెల 5, 6 తేదీల్లో అతడి ఏడేళ్ల కుమా రుడు జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ చిన్నారికి ఈ నెల 12న కరో నా పాజిటివ్ అని తేలింది. దీంతో చిన్నారితోపాటు, అతడి తండ్రిని కూడా అధికారులు గాంధీ ఆసు పత్రికి తరలించారు. కుటుంబంలోని మిగతా నలుగురి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం వారంతా పటాన్‌చెరులోని ఐసోలే షన్ కేంద్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నందున నగరంపై ప్రత్యేక ద ష్టి కేంద్రీ కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్‌గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు.